కొత్త సచివాలయంలో కేసీఆర్‌... కార్మికులకు వరాలు!

సిఎం కేసీఆర్‌ నిన్న రెండో రోజున కొత్త సచివాలయంకు ‘మే డే’ సందర్భంగా రాష్ట్రంలో పారిశుధ్య కార్మికులు, టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు వరాలు ప్రకటించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ స్థాయి నుంచి రాజధాని హైదరాబాద్‌ వరకు వివిద ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులందరికీ నెలకు రూ.1,000 చొప్పున జీతం పెంచాలని నిర్ణయించారు. దీని వలన రాష్ట్రంలో 1,06,474 మంది కార్మికులు లబ్ధి పొందనున్నారు. పెంచిన వేతనాలు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపారు. ప్రస్తుతం వారికి నెలకు రూ.9,500 జీతం లభిస్తోంది. జూన్ 1 నుంచి రూ.10,500 అందుకోబోతున్నారు. త్వరలో టీఎస్‌ఆర్టీసీ కార్మికులందరికీ కూడా జీతాలు పెంచాలని సిఎం కేసీఆర్‌ ఆర్ధికశాఖను ఆదేశించారు. ఆర్ధికశాఖ అధికారులు టీఎస్‌ఆర్టీసీ అధికారులతో చర్చించి త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకొనున్నారు. 

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాలలో ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణ గడువును మరో నెలరోజులు పొడిగిస్తున్నట్లు సిఎం కేసీఆర్‌ ప్రకటించారు. క్రమబద్దీకరణ కోసం జారీ చేసిన నోటరీ, జీవో 58,59లకు సంబందించిన సమస్యల పరిష్కారించుకోవడానికి వీలుగా మరింత గడువు కోరుతూ అభ్యర్ధనలు రావడంతో నెల రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో ప్రజలు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే తమ తమ నియోజకవర్గాలలోని ఎమ్మెల్యేలని కలిసిన్నట్లయితే వారు సహాయపడతారని కేసీఆర్‌ తెలిపారు. క్రమబద్దీకరణ చేయబడిన ఇండ్ల స్థలాలకు భూయాజమాన్యం, న్యాయపరమైన హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం పట్టాలు జారీ చేస్తుందని తెలిపారు. దీని కోసం జంటనగరాలలో ఎక్కడికక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు.      

హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్డులో అత్యాధునిక పబ్బులను, క్లబ్బులను తలదన్నేలా సర్వాంగ సుందరంగా నిర్మించిన నీరాకేఫ్‌ను బుదవారం ప్రారంభోత్సవం జరుగనుంది.