నేడు హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో సిఎం కేసీఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ ప్లీనరీ సమావేశం జరుగుతోంది. దీనిలో బిఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాలే లక్ష్యంగా 11 తీర్మానాలు చేసి ఆమోదించింది. ఆ తీర్మానాలు...
1. దేశంలో గుణాత్మకమైన మార్పును సాధించేందుకు బిఆర్ఎస్ కృషి చేయాలి.
2. దేశవ్యాప్తంగా నూతన విద్యుత్ విధానాన్ని అమలుకి విధాన రూపకల్పన చేయాలి.
3. దేశానికి నిర్ధిష్టమైన సాగునీటి విధానం రూపొందించాలి.
4. దేశవ్యాప్తంగా రైతులకు రైతుబంధు అమలు చేయాలి.
5. దేశవ్యాప్తంగా దళిత బంధు పధకాన్ని అమలు చేయాలి.
6. దేశ ప్రజలను మళ్ళీ ఏకం చేస్తూ బలీయమైన రాజకీయ శక్తిగా బిఆర్ఎస్ ముందుకు సాగాలి.
7. తెలంగాణ మోడల్ వ్యవసాయ విధానాలనే దేశవ్యాప్తంగా అమలుచేసేందుకు కృషి చేయాలి.
8. కేంద్రంలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి బీసీ జనగణన చేపట్టాలి.
9. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీఆర్ఎస్ అధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాలి.
10. దేశంలో మౌళిక వసతుల కల్పన చేయాలని...
11. మతోన్మాద శక్తుల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి.