
బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు తెలంగాణ భవన్‌లో సిఎం కేసీఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ మీటింగ్ జరుగనుంది. మొదట ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించాలని భావించినప్పటికీ వేసవి ఎండల తీవ్రత, అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో పంట నష్టాలను దృష్టిలో ఉంచుకొని 300 మందితో నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించారు.
సిఎం కేసీఆర్ ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ ఆవరణలో పార్టీ జండా ఎగురవేసి సమావేశం ప్రారంభిస్తారు. టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్నా ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్, డీసీసీబీ చైర్మన్లు హాజరవుతారు.
ఇప్పటికే అన్ని జిల్లాలలో బిఆర్ఎస్ మినీ ప్లీనరీలు నిర్వహించి కొన్ని తీర్మానాలు ఆమోదించాయి. వాటి ఆధారంగా రూపొందించిన తీర్మానలను నేడు ప్లీనరీలో ఆమోదిస్తారు.
ఈ ఏడాది చివరిలోగా తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరుగనున్నందున సిఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు ఈ ప్లీనరీలో దిశానిర్దేశం చేస్తారు.