కేసీఆర్‌ కోసం ప్రశ్నాపత్రం లీక్ చేసిన వైఎస్ షర్మిల!

టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వంతో పోరాడుతున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అధ్వర్యంలో బుదవారం హైదరాబాద్‌, ఇందిరా పార్కు వద్ద టి-సేవ్ పేరుతో నిరుద్యోగ దీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆమె సిఎం కేసీఆర్‌ కోసం పది ప్రశ్నలతో కూడిన ఓ ప్రశ్నాపత్రాన్ని మీడియాకు విడుదల చేసి వాటికి సమాధానాలు చెప్పాలని కోరారు. ఉద్యోగాల భర్తీ చేయాలని కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే, ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడేలోగా అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని, తక్షణం నిరుద్యోగ భృతి హామీని అమలుచేయాలని ఆమె సవాల్ విసిరారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మీకు, మీ కుమారుడు కేటీఆర్‌, మంత్రులకు ఎటువంటి సంబందామూ లేకపోతే సీబీఐ చేత దర్యాప్తు చేయించడానికి ఎందుకు భయపడుతున్నారు? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. 

ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై నేను సిట్‌ బృందాన్ని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వెళుతుంటే, పోలీసులతో తనను కేసీఆర్‌ ఎందుకు అడ్డుకొన్నారని ప్రశ్నించారు. ఒక్క మహిళని అడ్డుకోవడం కోసం డజన్ల కొద్దీ పోలీసులను దింపడం కేసీఆర్‌కె చెల్లునని అన్నారు. నేను సిట్ బృందాన్ని కలిసేందుకు పోలీసుల అనుమతి కోరనప్పుడు వారు నన్ను ఏవిదంగా హౌస్ అరెస్ట్‌ చేస్తారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. పోలీసులు నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఎలా అరెస్ట్‌ చేశారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. 

మంత్రులు అవహేళనలు భరిస్తూనే నేను రాష్ట్రంలో  సామాన్య ప్రజలు, నిరుద్యోగుల తరపున పోరాడుతున్నానని కానీ ఏ ఒక్కరూ తనకు సంఘీభావం తెలుపడం లేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉందని, అది నానాటికీ పెరిగిపోతోందని మొదట అధికార, ప్రతిపక్షాలకు తెలియజేప్పింది నేనే అని వైఎస్ షర్మిల అన్నారు. నిరుద్యోగుల కోసం పోరాడుతున్న తన గొంతు అణచివేసేందుకు కేసీఆర్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పోలీస్ శాఖ, పోలీసులంటే నాకు చాలా గౌరవమని, వారిని అవమానించాలనే ఉద్దేశ్యంతో నిన్న నేను ఆవిదంగా ప్రవర్తించలేదని, మాట్లాడలేదని, నన్ను అడ్డుకొంటున్నారనే ఆవేశంతోనే ఆవిదంగా వ్యవహరించానని వైఎస్ షర్మిల అన్నారు. 

సిఎం కేసీఆర్‌కు వైఎస్ షర్మిల సందించిన ప్రశ్నాపత్రం ఇదే...