పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు శుభవార్త!

పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు ఓ శుభవార్త! హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమా ఫస్ట్-గ్లింప్స్ ఈ నెల 11న విడుదల కాబోతోంది. పదకొండేళ్ళ క్రితం ఇదే రోజున వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ గబ్బర్ సింగ్‌ సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా ఆదేరోజున ఉస్తాద్ భగత్ సింగ్‌ ఫస్ట్-గ్లింప్స్ విడుదల చేస్తున్నామని హరీష్ శంకర్ సోషల్ మీడియాలో తెలిపారు. 

పవన్‌ కళ్యాణ్‌ వరుసపెట్టి అనేక సినిమాలు పూర్తి చేస్తున్నప్పటికీ వాటిలో ఈ ఉస్తాద్ భగత్ సింగ్‌ కోసమే అభిమానులు ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన హీరో పవన్‌ కళ్యాణ్‌‌ నుంచి వారు కోరుకొంటున్న ఫైట్స్, డైలాగ్స్, రొమాన్స్, కామెడీ అన్నీ ఉన్న సినిమా ఇది కావడమే కారణం.         

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అయనంకా బోస్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.