తెలంగాణ సచివాలయం ఫోటోలు మరికొన్ని... ఇవిగో

ఈ నెల 30వ తేదీన తెలంగాణ సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించబోతున్న సందర్భంగా రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ఆ విషయం తెలియజేస్తూ నాలుగు ఫోటోలను సోషల్ మీడియాలో ప్రజలకు షేర్ చేశారు. “మేము భవ్యమైన భవనాలను నిర్మిస్తాము... ఆ తర్వాత అవి మనల్ని ముందుకు నడిపిస్తాయి,” అంటూ విన్ స్టాన్ చర్చిల్ కొటేషన్ ఒకటి దానికి జత చేశారు. తెలంగాణ సచివాలయానికి రాష్ట్ర ప్రభుత్వం డా.బాబా సాహెబ్ అంబేడ్కర్‌ సచివాలయం అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. తద్వారా ఈ సచివాలయం నుంచి పాలన సాగించే ప్రభుత్వాలు రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల ప్రజలందరి జీవితాలలో వెలుగులు నింపేందుకు కృషి చేస్తాయని చెప్పకనే చెప్పిన్నట్లయింది.  

తెలంగాణ సచివాలయం ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా విడుదలయ్యాయి. తాజాగా మంత్రి హరీష్‌ రావు కూడా విడుదల చేసిన ఈ నాలుగు ఫోటోలలో సచివాలయం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది.