ఆ సుఖేష్ చంద్రశేఖర్ ఎవరో నాకు తెలీదు: కల్వకుంట్ల కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ అనే నిందితుడు ఇటీవల తాను బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో తాను చేసిన చాటింగ్ మెసేజులు ఇవిగో అంటూ కొన్ని మీడియాకు విడుదల చేశాడు. అయితే జైల్లో ఉన్న ఓ ఖైదీ వద్ద మొబైల్ ఫోన్‌ ఎందుకు ఉంది?కల్వకుంట్ల కవితకు ఈ కేసుతో సంబంధం ఉందని ఆరోపిస్తూ అతను ఎందుకు వాట్సప్ మెసేజులు విడుదల చేస్తున్నాడు?వాటిని పట్టుకొని మీడియా చెలరేగిపోవడం ఏమిటి? అనే సందేహాలు ఎవరికైనా కలిగాయో లేదో తెలీదు కానీ కల్వకుంట్ల కవిత మాత్రం ట్విట్టర్‌లో దీనిపై స్పందిస్తూ “తెలంగాణ బిడ్డలం ఎవరికీ తల వంచం” అనే హెడ్డింగుతో పెద్ద లేఖను పోస్ట్ చేశారు.

సిఎం కేసీఆర్‌కి దేశవ్యాప్తంగా మంచి పేరు, ప్రజాధారణ లభిస్తుండటంతో ఓర్వలేక, రాజకీయంగా ఎదుర్కొలేక తనను ఈ కేసులో ఇరికించి తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని కల్వకుంట్ల కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. ఓ ఆర్ధిక నేరగాడు వ్రాసిన లేఖను పట్టుకొని బిజెపి నేతలందరూ కధ అల్లేయగా,  కొన్ని మీడియా సంస్థలు వారికి వత్తాసు పలుకుతూ తమపై బురద జల్లుతున్నాయని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈ సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని పేర్కొన్నారు. ఇంకా ఆమె ఏమన్నారో ఆమె మాటలలోనే చూద్దాం...