సీనియర్ కాంగ్రెస్ నేత, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు తన రాజీనామా లేఖ పంపారు. దానిలో పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలియజేశారు. నేడు లేదా రేపు ఢిల్లీ వెళ్ళి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బిజెపిలో చేరానున్నారు. బిజెపిలో చేరబోతున్నట్లు మహేశ్వర్ రెడ్డి ప్రకటించడంతో హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో పలువురు బిజెపి నేతలు ఆయన నివాసానికి వెళ్ళి శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిని, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును పార్టీలోకి రప్పించేందుకు అటు కాంగ్రెస్, ఇటు బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారు. త్వరలో వీరిద్దరి చేరికపై కూడా స్పష్టత రావచ్చు.