
కేంద్ర ప్రభుత్వం సహకారం లేనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం సొంతంగా రాష్ట్రాభివృద్ధి చేసుకొంటూ అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య, వ్యవసాయ కళాశాలలు నిర్మించుకొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెలలో రూ.73 కోట్లు ఖర్చు చేసి వ్యవసాయ కళాశాల కోసం భారీ భవనసముదాయాలను నిర్మించింది. వాటిని ఈరోజు మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, స్పీకర్‌కు పోచారం శ్రీనివాస్ రెడ్డి కలిసి ప్రారంభోత్సవం చేయనున్నారు. వ్యవసాయ కళాశాలకు అనుబందంగా విద్యార్థుల కోసం హాస్టల్స్, వ్యవసాయ పరిశోధనలకు అవసరమైన అత్యాధునికమైన ల్యాబ్స్ వగైరాలు కూడా నిర్మించారు. వ్యవసాయ కళాశాల చుట్టూ పచ్చటి మొక్కలతో ల్యాండ్ స్కేపింగ్ కూడా చేయడంతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం పరిధిలో ఈ వ్యవసాయ కళాశాల పనిచేస్తుంది.