సుఖోయ్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి ముర్ము

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం అస్సాం రాష్ట్రంలో తేజ్‌పూర్‌ వద్దగల భారత వాయుసేనకు చెందిన వైమానిక స్థావరం నుంచి సుఖోయ్ ఎంకెఐ30 యుద్ధవిమానంలో ప్రయాణించారు. ఎల్లప్పుడూ సాంప్రదాయ చీరకట్టులో కనిపించే ద్రౌపదీ ముర్ము ఈరోజు యుద్ధవిమానంలో ప్రయాణించేందుకు తొలిసారిగా పైలట్లు ధరించే యూనిఫారం ధరించి యుద్ధ విమానం ముందు నిలబడి ఫోటో దిగారు. ముందుగా వాయుసేన గౌరవ వందనం అందుకొన్న తర్వాత ఆమె సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రవేశించారు. దానిని గ్రూప్ కెప్టెన్ నవీన్ కుమార్‌ తివారీ నడిపించారు. దాదాపు 10-15 నిమిషాల సేపు ఆమె యుద్ధవిమానంలో ప్రయాణించారు. యుద్ధవిమానంలో ప్రయాణించడం మాటలలో వర్ణించలేని ఆధుభూతమైన అనుభూతి అని ద్రౌపదీ ముర్ము అన్నారు. ఇంతకు ముందు 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ద్రౌపదీ ముర్ము ప్రయాణించారు. 



రాష్ట్రపతి ద్రౌపదీ ద్రౌపదీ ముర్ము గత గురువారం నుంచి అస్సాం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. శుక్రవారం కాజీరంగా జాతీయ పార్కులో గజ్ ఉత్సవ్‌ను ప్రారంభించారు. తర్వాత మౌంట్ కాంచనగంగ సాహసయాత్ర-2023ని కూడా ప్రారంభించారు.