17.jpg)
తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఉద్దేశ్యించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “పిచ్చోని చేతిలో రాయి ఉంటే వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం. కానీ అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. తమ స్వార్ధ రాజకీయాల కోసం ప్రశ్నాపత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బిజెపి నాయకులు,” అంటూ ట్వీట్ చేశారు. దాని కింద బిఆర్ఎస్ పార్టీ పోస్ట్ చేసిన “లీకేజీ కుట్ర బండిదే! ఫ్లాష్ ఫ్లాష్ సంజయ్ అరెస్ట్ అంటూ పేపర్లో వచ్చిన వార్త క్లిప్పింగును ట్యాగ్ చేశారు.
మంత్రులు, బిఆర్ఎస్ ఎమ్మెల్యే అందరూ ఇప్పుడు బండి సంజయే ప్రశ్నాపత్రాలను లీకేజి కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందిస్తూ, కేసీఆర్ ప్రభుత్వం ప్రశ్నాపత్రాల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో తన అసమర్ధతను, వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే బండి సంజయ్‌ని అరెస్ట్ చేసింది. అయితే ఇటువంటి కేసులు, అరెస్టులకు బిజెపి ఎన్నడూ భయపడబోదు. ఎంతమందిని అరెస్ట్ చేసుకొంటారో చేసుకోండి. మరో ఆరునెలలే మీకు సమయం మిగిలి ఉంది. ఆ తర్వాత తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే,” అని అన్నారు.