2.jpg)
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సోమవారం సుప్రీంకోర్టు మరోసారి నిరాశ మిగిలింది. ఈ కేసులో ప్రశ్నించేందుకు మహిళనైన తనను ఢిల్లీలో ఈడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నిస్తుండటం, ఈడీ అధికారుల తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై నేడు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, అభిషేక్ బెనర్జీ, నళినీ చిదంబరంలు వేసిన ఇటువంటివే మరో పిటిషన్లతో కలిపి విచారణ జరుపుతామని చెపుతూ ఈ కేసు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. దీనిపై ఈడీని కౌంటర్ దాఖలు చేయాలని మాత్రమే కోరింది తప్ప కల్వకుంట్ల కవితని తమ కార్యాలయానికి పిలిచి విచారించరాదని కానీ, ఆమెను అరెస్ట్ చేయవద్దని గానీ సుప్రీంకోర్టు ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. కనుక ఈడీ కోరుకొంటే మళ్ళీ ఎప్పుడైనా కల్వకుంట్ల కవితకు నోటీస్ జారీ చేసి విచారణకు పిలవగల వెసులుబాటు అవకాశం ఉంది.