దేశవ్యాప్తంగా సికింద్రాబాద్‌తో సహా 57 కంటోన్మెంట్ ఏరియాలు, వాటి నిర్వహణకు బోర్డులు ఉన్నాయి. వాటన్నటికీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫిభ్రవరి 17నా నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 28,29 తేదీలలో నామినేషన్లు స్వీకరించి 30వ తేదీన ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు కూడా. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాతో సహా మరికొన్ని స్థానిక మున్సిపాల్ కార్పొరేషన్లలో విలీన ప్రక్రియ జరుగుతున్నందున, ఎన్నికలను వాయిదా లేదా రద్దు చేయాలని వివిద బోర్డు సభ్యులు కేంద్రాన్ని అభ్యర్ధించారు. వారి అభ్యర్ధన మేరకు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని తెలియజేసింది.