బాలకృష్ణ టిడిపికి హీరో మాకు కాదు: వైసీపీ ఎమ్మెల్యే

ప్రముఖ నటుడు, హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల తెనాలిలో పర్యటించినప్పుడు, నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి సభాముఖంగా వార్నింగ్ ఇచ్చారు. “వేడుకలో నా సినిమా పాట వేయొద్దని చెప్పడానికి నువ్వెవరు?దమ్ముంటే నన్ను రాజకీయంగా ఎదుర్కో లేదా ఎమ్మెల్యేవి కనుక  బుద్ధిగా నీ పని నువ్వు చేసుకో. అంతేకానీ నా సినిమాల జోలికి రావొద్దు. నేను మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో తెలుసుగా?నేను ఒక్క చిటికెస్తే నా అభిమానులు నీ పని పడతారు జాగ్రత్త,” అని బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. 

దీనిపై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందిస్తూ, “నువ్వు మీ పార్టీకి హీరోవి కావచ్చు కానీ మాకు కాదు. ప్రతీసారి ఇలాగే నోటికి వచ్చిన్నట్లు ఏదో ఒకటి మాట్లాడేయడం, అభిమానులను చెంప దెబ్బలు కొట్టడం, ఆ తర్వాత తప్పు అయ్యిందని చెప్పుకోవడం నీకు పరిపాటిగా మారింది. అక్కడ వేడుకల్లో ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడొద్దు. ఎవడో తాగుబోతు ఏదో చెపితే వాడి మాటలు నమ్మి సాటి శాసనసభ్యుడి గురించి ఇలాగేనా మాట్లాడేది?అయినా మనుషులకు మూడో కన్ను ఉండదని తెలీదా?” అంటూ ఘాటుగా బదులిచ్చారు. 

వీడియో మ్యాంగో న్యూస్ సౌజన్యంతో...