తెలంగాణ సచివాలయం వీడియో చూశారా?

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న కొత్త సచివాలయ నిర్మాణ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఏప్రిల్ 30వ తేదీన దీని ప్రారంభోత్సవం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు రూ.650 కోట్లు వ్యయంతో నిర్మించిన ఈ కొత్త సచివాలయం సర్వాంగ సుందరంగా తయారైంది. బడుగు బలహీనవర్గాల ప్రజల కోసం పోరాడిన డా.అంబేడ్కర్ పేరుని దీనికి ఖరారు చేసింది. 

కొత్త సచివాలయం ఫోటోలు ఇప్పటికే చాలా వచ్చాయి. కానీ తొలిసారిగా సచివాలయాన్ని ఏరియల్ వ్యూలో చూపిస్తూ ఓ గ్రాఫిక్ వీడియో రిలీజ్‌ చేశారు. ఈ వీడియోలో సచివాలయం లోపల ఏవిదంగా ఉందో కూడా చూపారు.           

సచివాలయానికి సమీపంలో నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని, రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున జూన్2వ తేదీన ఆవిష్కరించనున్నారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున 125 అడుగుల ఎత్తున్న డా.అంబేడ్కర్ విగ్రహాన్ని నిలబెట్టి తుడిమెరుగులు దిద్దుతున్నా సంగతి తెలిసిందే. అవి పూర్తయితే ఏప్రిల్ 14వ తేదీన డా.అంబేడ్కర్ జయంతి రోజున విగ్రహావిష్కరణ చేసే అవకాశం ఉంది.