తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు

సిఎం కేసీఆర్‌ శుక్రవారం ఉదయం మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి కొత్తగా నిర్మింపబడుతున్న సచివాలయాన్ని సందర్శించి, పనుల పురోగతి పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్త సచివాలయాన్ని ఏప్రిల్ 30వ తేదీన ప్రారంభోత్సవం చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కేసీఆర్‌ పుట్టినరోజునాడు అంటే ఫిభ్రవరి 17వ తేదీన దీనిని ప్రారంభించాలని ముహూర్తం కూడా పెట్టుకొన్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో వాయిదా పడింది. దాదాపు రూ.650 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న ఈ కొత్త సచివాలయానికి డా.అంబేడ్కర్ సచివాలయంగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే.    

సచివాలయానికి సమీపంలో నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని, రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున జూన్2వ తేదీన ఆవిష్కరించనున్నారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున 125 అడుగుల ఎత్తున్న డా.అంబేడ్కర్ విగ్రహాన్ని నిలబెట్టి తుడిమెరుగులు దిద్దుతున్నా సంగతి తెలిసిందే. అవి పూర్తయితే ఏప్రిల్ 14వ తేదీన డా.అంబేడ్కర్ జయంతి రోజున విగ్రహావిష్కరణ చేసే అవకాశం ఉంది.