
కేంద్ర ప్రభుత్వం హటాతుగ్గా 13 రాష్ట్రాలకి కొత్త గవర్నర్లని నియమించింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రం పట్నాయక్, అస్సాం: గులాబ్ చంద్ కటారియా, సిక్కిం: లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ఝార్ఖండ్: సిపి రాధాకృష్ణన్, హిమాచల్ ప్రదేశ్: శివప్రతాప్ శుక్లాలని కొత్తగా గవర్నర్లుగా నియమించింది.
ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ని ఛత్తీస్‌ఘడ్ గవర్నర్‌గా బదిలీ చేసి ఏపీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ని గవర్నర్‌గా నియమించింది.
ఇంతవరకు ఛత్తీస్‌ఘడ్ గవర్నర్‌గా ఉన్న అనుసూయియా ఉయికేని మణిపూర్‌కి బదిలీ చేసి, మణిపూర్ గవర్నర్ లా గణేశన్‌ని నాగాలాండ్‌కి బదిలీ చేసింది.
బిహార్ గవర్నర్ ఫాగూ చౌహాన్ని మేఘాలయకి బదిలీ చేసి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ అర్లేకర్‌ని బిహార్ గవర్నర్‌గా నియమించింది.
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బీడీ మిశ్రాని లద్దాక్ గవర్నర్‌గా నియమించింది.