తెలంగాణ శాసనమండలి డెప్యూటీ ఛైర్మన్‌గా బండా ప్రకాష్ ముదిరాజ్‌కి సిఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. డెప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ పదవీకాలం రెండేళ్ల క్రితం జూన్‌లోనే ముగిసినపటికీ ఆ పదవిలో ఎవరినీ నియమించకుండా ఖాళీగా ఉంచేశారు. ఇప్పుడు బండా ప్రకాష్ ముదిరాజ్‌ని ఆ పదవికి కేసీఆర్ ఎంపిక చేశారు. డెప్యూటీ ఛైర్మన్ ఎన్నికకి శుక్రవారం నోటిఫికేషన్ వెలువడింది. కనుక నేడు బండా ప్రకాష్ ముదిరాజ్ నామినేషన్ వేయబోతున్నారు. అయితే ఈ ఎన్నిక లాంఛనప్రాయమే కనుక రేపు ఉదయం 10 గంటలకి ఎన్నికైన్నట్లు ప్రకటించి వెంటనే ఆయన చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు.
బండా ప్రకాష్ ముదిరాజ్ 2018లో బిఆర్ఎస్ తరపున రాజ్యసభకి ఎంపికయ్యారు. కానీ ఆయన పదవీకాలం పూర్తికాక మునుపే 2021, నవంబర్‌లో ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి ఎన్నికవడంతో మరుసటి నెలలో తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు మండలి డెప్యూటీ ఛైర్మన్ పదవి చేపట్టబోతున్నారు.