బడ్జెట్‌లో తెలంగాణకి 21,470 కోట్లు... ఏపీకి 41,339 కోట్లు

ఈరోజు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24 సం.ల బడ్జెట్‌లో ఏపీకి పన్ను వాటాగా రూ.41,339 కోట్లు, తెలంగాణకి రూ.21,470 కోట్లుగా పేర్కొంది. ఇక తెలంగాణలో సింగరేణి సంస్థకి రూ.1,650 కోట్లు, ఐఐటి హైదరాబాద్‌కి రూ.300 కోట్లు, మణుగూరు, కోట భారజాల కర్మాగారాలకి రూ.1,473 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి 18.5 కోట్లు, బీబీ నగర్‌తో సహా దేశవ్యాప్తంగా అన్ని ఎయిమ్స్ హాస్పిటల్స్ కొరకు రూ.6,835 కోట్లు, హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియంతో సహా దేశవ్యాప్తంగా అన్ని మ్యూజియమ్స్ కలిపి రూ. 357 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది.       

విభజన హామీలలో ఒకటైన ఏపీలో పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటుకి రూ.168 కోట్లు, ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.47 కోట్లు, అమ్మకానికి పెట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ఆధునీకరణకి రూ.683 కోట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించింది. 

ఈసారి రైల్వేకి బడ్జెట్‌లో రూ.2.43 లక్షల కోట్లు కేటాయించినందున రెండు తెలుగు రాష్ట్రాలలో రైల్వే ప్రాజెక్టులకి భారీగానే నిధుల కేటాయింపు జరిగి ఉండవచ్చు.