
తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి ఈ నెలాఖరున పదవీ విరమణ చేస్తుండటంతో ప్రస్తుతం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న 1990 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అంజనీ కుమార్‌కి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ హోం శాఖ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. పనిలో పనిగా రాష్ట్రంలో ఆరుగురు సీనియర్ ఐపిఎస్ అధికారులని బదిలీ చేసింది.
ప్రస్తుతం హోం శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న రవిగుప్తాని అవినీతి నిరోధక శాఖ డీజీగా నియమించింది. ఆయన స్థానంలో హోం శాఖ కార్యదర్శిగా ముఖ్య కార్యదర్శిగా జితేందర్‌ని నియమించింది.
రాచకొండ కమీషనర్ మహేశ్ భగవత్‌ని సీఐడీ డీజీగా నియమించింది. రాచకొండ కమీషనర్‌గా డిఎస్ చౌహాన్ నియమితులయ్యారు. శాంతిభద్రతల అదనపు డీజీగా సంజయ్ కుమార్ జైన్, విజిలెన్స్ డీజీగా రవిగుప్తా నియమితులయ్యారు.