గుజరాత్‌లో బిజెపి, హిమాచల్లో కాంగ్రెస్‌ క్లీన్ స్వీప్

గుజరాత్‌, హిమాచల్ ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల ఫలితాలు బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చాలా సంతోషం కలిగించాయి. గుజరాత్‌లో బిజెపి, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీతో గెలిచి అధికారం చేపట్టబోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం గుజరాత్‌లో బిజెపి 182 స్థానాలకు 105 గెలుచుకొని మరో 49 స్థానాలలో ఆదిక్యతలో కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లో 68 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ 23 స్థానాలు గెలుచుకొని మరో 17 స్థానాలలో ఆదిక్యంలో కొనసాగుతోంది. ఇక ఆమాద్మీ పార్టీ బిజెపి కంచుకోట గుజరాత్‌లో అడుగుపెట్టింది. మూడు స్థానాలు గెలుచుకొని మరో 2 స్థానాలలో ఆదిక్యంలో ఉంది. కానీ హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.