
నేడు గుజరాత్ రెండో (చివరి) దశ పోలింగ్ కూడా ముగియడంతో సర్వే సంస్థలు ఎన్నికల ఫలితాల గురించి తమ అంచనాలను ప్రకటించాయి. వాటి ప్రకారం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాలలో మళ్ళీ బిజెపియే అధికారంలోకి రానుంది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ నెల 8వ తేదీన వెలువడనున్నాయి.
రెండు రాష్ట్రాలలో మళ్ళీ బిజెపి అధికారంలోకి వచ్చిన్నట్లయితే అది లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి సానుకూల అంశంగా నిలుస్తుంది. ముఖ్యంగా 26 లోక్‌సభ స్థానాలున్న గుజరాత్లో బిజెపి అధికారంలో ఉన్నట్లయితే వాటిలో అత్యధిక స్థానాలను బిజెపియే గెలుచుకోగలుగుతుంది. ఇక గుజరాత్లో బిజెపి పాలన చాలా దారుణంగా ఉందని, కనుక ఈసారి బిజెపి ఓటమి ఖాయమని, అప్పుడు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పవచ్చని భావిస్తున్న సిఎం కేసీఆర్‌కి కూడా ఇది తీవ్ర నిరాశ కలిగించే విషయమే అవుతుంది.