నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, సింహయాజీ, నందుకుమార్‌లకు హైకోర్టు రిమాండ్ విధించింది. వారు ముగ్గురూ తక్షణం సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా ఏసీబీ ప్రత్యేక కోర్టు తీర్పును కొట్టివేసింది.
మొయినాబాద్ పోలీసులు మొదట వారిని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, ఏసీబీ నిబందనల ప్రకారం నిందితులకు ముందుగా నోటీస్ జారీచేయకుండా వారికి రిమాండ్ విధించాలని కోరడం సరికాదంటూ వారి పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. దానిపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు ఏసీబీ ప్రత్యేక కోర్టు తీర్పును కొట్టివేస్తూ, ముగ్గురు నిందితులను లొంగిపోవాలని ఆదేశించింది.