ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో మునుగోడు ఉపఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులతో పాటు మొత్తం 140 మందికి పైగా అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేసినట్లు సమాచారం. ఇవాళ్ళ చివరిరోజు కావడం ఇవాళ్ళ ఒక్కరోజే 50 మందికి పైగా అభ్యర్ధులు నామినేషన్లు వేశారు. వీరిలో చర్లగూడెం బాధితులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. రేపు, ఎల్లుండి నామినేషన్లను పరిశీలన చేసిన తర్వాత అర్హులు ఎంతమంది ఉన్నారో ప్రకటిస్తారు. ఈనెల 17వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంది. నామినేషన్ల ఉపసంహరణ కూడా ముగిసిన తర్వాత మునుగోడు ఉపఎన్నికల బరిలో ఎంత మంది మిగిలారనేది స్పష్టం అవుతుంది. గత ఎన్నికలలో మొత్తం 33 మంది నామినేషన్లు వేయగా నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత చివరికి 15 మంది బరిలో మిగిలారు. అప్పుడు 5 ఏళ్ళ కాలానికి ఎన్నికలు జరిగినప్పుడు 33 మంది నామినేషన్లు వేయగా, ఇప్పుడు మిగిలిన ఈ ఏడాదిన్నర కాలం కోసం ఏకంగా 140 మంది నామినేషన్లు వేయడం విశేషమే కదా?