టిఆర్ఎస్ చేనూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌కి ఎవరూ ఊహించని సమస్య వచ్చిపడింది. చెన్నూరుకే చెందిన వంగల సంతోష్ అనే సీఆర్పీఎఫ్లో జవానుగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం కర్ణాటకలోని బీజాపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్న అతను తన వద్ద ఉన్న ఏకె47 రైఫిల్‌లో వాడే 62 బుల్లెట్లను ఓ తువ్వాలుపై ‘జై బాల్క సుమన్’ అని పేరు వచ్చేలా పేర్చి, దానిని ఫోటో తీసి ఆ ఫోటోను తన వాట్సప్ స్టేటస్‌లో పెట్టుకొన్నాడు. అంతటితో ఆగకుండా చెన్నూరులో టిఆర్ఎస్ పార్టీలోని తన దోస్తులకు దానిని ఫార్వర్డ్ చేశాడు. దాంతో వారు కూడా ఆ ఫోటోనువాట్సప్ స్టేటస్‌లో పెట్టుకొని మరింత మందికి పంపించారు. ఈ విషయం సోషల్ మీడియాలోకి ఎక్కడంతో వైరల్ అయ్యింది. తన పేరుని ఏకె47 బుల్లెట్లతో లింక్ చేస్తూ సోషల్ మీడియాలో ఏదో న్యూస్ వస్తోందని తెలియగానే బాల్క సుమన్ కూడా అప్రమత్తమయ్యి విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వారు అప్రమత్తమయ్యి దర్యాప్తు మొదలుపెట్టగా అసలు విషయం బయటపడింది. వంగల సంతోష్‌ని మందలించి తక్షణమే అన్ని గ్రూపులలో నుంచి ఆ ఫోటోలను తొలగించవలసిందిగా ఆదేశించారు.