జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే అబ్రహం కుమారుడు అజయ్ కుమార్, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయి చంద్ వర్గాల మద్య చిరకాలంగా కోల్డ్ వరంగల్ జరుగుతోంది. శుక్రవారం సమైక్య వజ్రోత్సవ వేడుకలలో రెండు వర్గాలు మీడియా ఎదుటే పరస్పరం దాడులు చేసుకొన్నాయి. సభలో సాయి చంద్ ప్రసంగించి తన అనుచరులతో కలిసి బయలుదేరుతుండగా అజయ్ కుమార్ అనుచరులు ఆయనపై దాడి చేశారు. ఊహించని ఈ పరిణామానికి వారు షాక్ అయినప్పటికీ వెంటనే తేరుకొని ఎదురుదాడి చేశారు. రెండు వర్గాలు అధికార టిఆర్ఎస్‌కు చెందినవారే కావడంతో పోలీసులు వారిని విడిపించి శాంతింపజేసేందుకు చాలా కష్టపడవలసి వచ్చింది. వచ్చే ఎన్నికలలో ఆలంపూర్ నుంచి శాసనసభకు పోటీ చేసేందుకు సాయి చంద్ టికెట్ కోసం ప్రయత్నిస్తునందునే ఎమ్మెల్యే అబ్రహం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.