నా బంగారు తల్లికి జన్మదిన శుభాకాంక్షలు: రోజా

అలనాటి నటి, నేటి ఏపీ మంత్రి ఆర్‌కె. రోజా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఈరోజు ఆమె కుమార్తె అన్షూ మాలిక పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్‌లో ఆమె ఫోటోలు, తాను, తన భర్త సెల్వమణి, కుమార్తెతో కలిసి దిగిన ఫోటోలు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. రోజా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నటుడు నాగబాబుతో కలిసి జబర్దస్త్ టీవీ షోలో న్యాయనిర్ణేతలుగా పాల్గొనేవారు. ఏపీ పర్యాటకశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పని ఒత్తిడి పెరగడంతో ఆ కార్యక్రమానికి దూరమయ్యి పూర్తిగా రాజకీయాలకే పరిమితమయ్యారు. ఇటీవలే కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాలో విహారయాత్రకు వెళ్ళి హాయిగా గడిపివచ్చారు.