జిల్లాల వారీగా పంచాయతీరాజ్ పోస్టుల కేటాయింపు

ఇటీవల పంచాయతీరాజ్ శాఖకు ఆర్ధికశాఖ మొత్తం 529 పోస్టులను మంజూరు చేయడంతో వాటిని జిల్లాలవారీగా కేటాయిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ డైరెక్టర్‌ హనుమంతరావు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో జిల్లా పరిషత్ (జెడ్పీ), జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాలు (డీపీవో) పోస్టులున్నాయి. 529 పోస్టులలో 103 జెడ్పీ సూపరింటెండెంట్‌ పోస్టులు, 151 జెడ్పీ సీనియర్ అసిస్టెంట్ పోస్టులు, 213 జెడ్పీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. 

ఆదిలాబాద్‌-17, కొత్తగూడెం-14, హనుమకొండ-16, జగిత్యాల-19, జనగామ-17, జైశంకర్ భూపాలపల్లి-14, గద్వాల-16, కామారెడ్డి-18, కరీంనగర్‌-9, ఖమ్మం-0, ఆసిఫాబాద్-21, మహబూబాబాద్-22, మహబూబ్‌నగర్‌-07, మంచిర్యాల-22, మేడ్చల్-4, మెదక్-27, ములుగు-10, నాగర్ కర్నూల్-27, నల్లగొండ-17, నారాయణపేట-12, నిర్మల్-27, నిజామాబాద్‌-24, పెద్దపల్లి-13, రాజన్న సిరిసిల్లా-16, రంగారెడ్డి-7, సంగారెడ్డి-27, సిద్ధిపేట-34, సూర్యాపేట-26, వికారాబాద్-6, వనపర్తి-23, వరంగల్‌-5, యాదాద్రి భువనగిరి జిల్లాకు 12 పోస్టులు మంజూరు అయ్యాయి. త్వరలోనే వీటికి టిఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది.