ఢిల్లీలో త్రివర్ణ పతాకంతో స్కూటీ క్లీనింగ్... అరెస్ట్

కొన్ని దేశాలతో పోలిస్తే భారత్‌లో జాతీయ జెండా అన్నా, జాతీయ గీతం అన్నా చాలామందికి అలుసే అంటే ఎవరూ ఒప్పుకోకపోవచ్చు కానీ ఇది చేదు నిజం. సినిమా థియేటర్లలో జనగణమణ గీతం వస్తే లేచి నిలబడేందుకు, గొంతు కలిపి పాడేందుకు కొంతమంది ఇష్టపడరు. లేచి నిలబడటం, జాతీయ గీతం పాడటం నామోషీగా ఫీల్ అవుతుంటారు.  

ఈశాన్య ఢిల్లీలోని భజన్ పురా అనే ప్రాంతంలో ఓ వ్యక్తి తన ఇంటి ముందు నిలిపి ఉంచిన స్కూటీని జాతీయ జెండాతో తుడుచుకొన్నాడు. అదేదో పనికిరాని గుడ్డముక్క అన్నట్లు జాతీయ జెండాతో స్కూటీని తుడుచుకోవడం చూసి ఎవరో వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్ అయ్యింది. 

అది ఢిల్లీ పోలీసుల దృష్టికి రావడంతో వెంటనే అతనిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అతని స్కూటీని, జాతీయ జెండాను కూడా స్వాధీనం చేసుకొన్నారు.