
బిజెపి ఎంపీ కె లక్ష్మణ్ ఈరోజు హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణలో బిజెపి ఒంటరిగానే పోటీ చేస్తుంది. దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే బిజెపి అధికారంలోకి రాబోతోంది. ఇంట గెలవలేని కేసీఆర్ దేశాన్ని ఉద్దరిస్తానంటూ బిహార్ వెళ్ళడం చాలా హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణ, బిజెపి ముఖ్యమంత్రులు ఇద్దరూ పచ్చి అవకాశవాదులే. కేసీఆర్ మెల్లగా కాంగ్రెస్ పార్టీతో దోస్తీకి సిద్దమవుతున్నట్లున్నారు,” అని కె లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.
తెలంగాణలో బిజెపితో కలిసి పనిచేసేందుకు ఏ పార్టీ ముందుకు రావడం లేదు కనుకనే ఒంటరిగా పోటీ చేస్తామని కె లక్ష్మణ్ చెపుతున్నారు. అయితే బిజెపితో కలిసి పనిచేయడానికి ఏ పార్టీ రాకపోయిన్నప్పటికీ వివిద పార్టీల నేతలను నయాన్నో భయాన్నో లొంగదీసుకొని పార్టీలో చేర్చుకొంటూనే ఉంది.