
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఓ శుభవార్త! ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)కు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. గత ఏడాది జూన్ 11న ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర ఖజానా విభాగం మంగళవారం మార్గదర్శకాలను జారీ చేసింది.
• చనిపోయిన లేదా విధులు నిర్వర్తించలేని స్థితిలో ఉన్న ఉద్యోగి తన చివరి జీతం ఎంత పొందితే దానిల్ 33 శాతం పెన్షన్ అతను లేదా ఆమె కుటుంబానికి అందుతుంది.
• ఒకవేళ ఉద్యోగి వేతనం నుంచి సీపీఎస్ కొరకు సొమ్ము మినహాయించుకోకపోయినప్పటికీ, ఈ పెన్షన్ పొందేందుకు శాశ్విత అకౌంట్ నంబర్ (పాన్) లేనప్పటికీ ఈ పెన్షన్ పొందేందుకు అర్హులే.
• ఈ ఉత్తర్వులు జారీకి ముందే చనిపోయిన ఉద్యోగులు లేదా అరకొర పెన్షన్ పొందుతున్న ఉద్యోగి కుటుంబాలకు కూడా ఇది వర్తిస్తుంది.
ఉద్యోగుల కుటుంబాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వారికి మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులపై తెలంగాణ రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు హర్షం వ్యక్తం చేసి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.