సంబంధిత వార్తలు
హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య (104) మంగళవారం రాత్రి కనుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆర్‌వీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
ఈటల మల్లయ్య అంత్యక్రియలను ఆయన స్వగ్రామమైన హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో ఈరోజు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నికల హడావుడిలో ఉన్న ఈటల రాజేందర్ తండ్రి మరణవార్త తెలుసుకొని వెంటనే కమలాపూర్ బయలుదేరారు.