
ఈరోజు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేయవలసి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోతో నేడు నగరంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని ఈ నెల 27వ తేదీకి వాయిదా వెస్త్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.
చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ను రూ.45.79 కోట్లు వ్యయంతో నిర్మించారు. నాలుగు లేన్లతో నిర్మించబడిన ఈ ఫ్లైఓవర్ పొడవు 674 మీటర్లు. ఇంతకాలం వాహనదారులు కందికల్ గేట్, బార్కస్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకొని నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఫ్లైఓవర్‌తో ఈ మూడు జంక్షన్స్ మీదుగా ఎక్కడా ఆగకుండా వెళ్ళిపోవచ్చు. ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నప్పుడే దాని అప్రోచ్ రోడ్ కూడా విస్తరించినందున శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎల్బీనగర్ మీదుగా మరింత సౌకర్యవంతంగా, సులువుగా నల్గొండ, వరంగల్ చేరుకోవచ్చు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ఈనెల 27కి వాయిదా పదినందున నగర ప్రజలు మరో నాలుగు రోజులు ఎదురుచూడక తప్పదు.