
భారత్ వజ్రోత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ మంగళవారం ఉదయం 11.30 గంటలకు జాతీయగీతాన్ని ఆలపించబోతున్నారు. అప్పుడు హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేసి ప్రజలందరూ జాతీయగీతాలపన చేస్తారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్నిచోట్ల ఉదయం 11.30 గంటలకు రెడ్ ట్రాఫిక్ సిగ్నల్స్ వేసి ట్రాఫిక్ నిలిపివేయనున్నారు. సిఎం కేసీఆర్ అబిడ్స్ జంక్షన్ వద్ద జెండా ఎగురవేసి జాతీయ గీతాలపన కార్యక్రమంలో పాల్గొంటారు.
నిన్న యావత్ దేశం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనం జరుపుకొన్నప్పుడు ఆయా వేదికలపై జాతీయ గీతాలాపన చేసి జాతీయ సమగ్రతను చాటిచెప్పారు. కానీ తొలిసారిగా ఒక రాష్ట్రంలో ప్రజలందరూ ఒకే సమయంలో జాతీయ గీతాలపన చేయడం చాలా గొప్ప విషయం. చాలా అభినందనీయం. దీంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలువబోతోంది.