
జూబ్లీహిల్స్లో మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్కు కూడా గురువారం నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లకు ఇదివరకే బెయిల్ మంజూరు అయ్యింది. జూబ్లీహిల్స్ పోలీసులు గత వారమే నాంపల్లి కోర్టులో, జువైనల్ జస్టిస్ బోర్డులో వేర్వేరుగా ఛార్జ్-షీట్లు దాఖలు చేశారు. అయితే ఇటువంటి కేసులలో న్యాయవిచారణ ఏవిదంగా జరుగుతుందో ఎన్నేళ్ళు సాగుతుందో అందరికీ తెలుసు. కనుక ఈ గ్యాంగ్ రేప్ నిందితులందరూ యధాప్రకారం హాయిగా జీవించవచ్చు. అత్యంత హేయమైన నేరానికి పాల్పడిన నేరస్తులు బెయిల్పై విడుదలై బయట స్వేచ్చగా తిరుగుతుంటే, అత్యాచార బాధితురాలు సమాజానికి మొహం చూపలేని దుస్థితి నెలకొనడాన్ని ఏమనుకోవాలి? మన న్యాయవ్యవస్థ పనితీరు ఈవిదంగా ఉంటుంది కనుకనే ఇటువంటి నేరాలు నిర్భయంగా చేయగలుగుతున్నారు.