
తెలంగాణ రాష్ట్రంలో మొన్న శనివారం కొత్తగా ఏర్పాటు చేసిన 13 మండలాలతో కలిపి మొత్తం 607 మండలాలు కాగా వాటికి మరో మండలం కలవబోతోంది. అదే మహబూబాబాద్ జిల్లాలో ఇనుగుర్తి రెవెన్యూ మండలం. ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీలు మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సోమవారం ప్రగతి భవన్‌కు వెళ్ళి సిఎం కేసీఆర్‌ని కలిసి ఇనుగుర్తిని మండలంగా చేయాలని అభ్యర్ధించారు. మండలాల ఏర్పాటుకు ఇనుగుర్తికి అన్ని అర్హతలు కలిగి ఉందని దాని వలన ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని వారు విజ్ఞప్తి చేయగా సిఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. వెంటనే ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా ఆదేశించారు.
|
|
జిల్లా |
రెవెన్యూ
డివిజన్ |
కొత్తగా
ఏర్పాటు చేసిన మండలం |
|
1 |
నిజామాబాద్ |
ఆర్మూర్
రెవిన్యూ డివిజన్ |
ఆలూర్, డొంకేశ్వర్
మండలాలు |
|
2 |
నిజామాబాద్ |
బోధన్
రెవిన్యూ డివిజన్ |
సాలూర
మండలం |
|
3 |
నారాయణ
పేట |
నారాయణ
పేట రెవిన్యూ డివిజన్ |
గుండుమల్, కొత్తపల్లె
మండలాలు |
|
4 |
వికారాబాద్ |
తాండూర్
రెవిన్యూ డివిజన్ |
దుడ్యాల్
మండలం |
|
5 |
మహబూబ్
నగర్ |
మహబూబ్
నగర్ రెవిన్యూ డివిజన్ |
కౌకుంట్ల
మండలం |
|
6 |
మహబూబాబాద్ |
మహబూబాబాద్
రెవిన్యూ డివిజన్ |
సీరోల్
మండలం |
|
7 |
మహబూబాబాద్ |
ఇనుగుర్తి
రెవిన్యూ
డివిజన్ |
ఇనుగుర్తి
మండలం |
|
8 |
నల్లగొండ |
నల్లగొండ
రెవిన్యూ డివిజన్ |
గట్టుప్పల్
మండలం |
|
9 |
సంగారెడ్డి |
నారాయణ్
ఖేడ్ రెవిన్యూ డివిజన్ |
నిజాంపేట్ మండలం |
|
10 |
కామారెడ్డి |
బాన్సువాడ
రెవిన్యూ డివిజన్ |
డోంగ్లీ మండలం |
|
11 |
జగిత్యాల |
జగిత్యాల
రెవిన్యూ డివిజన్ |
ఎండపల్లి
మండలం |
|
12 |
జగిత్యాల |
కోరుట్ల
డివిజన్ |
భీమారం
మండలం |