తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా13 మండలాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో 3, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1, నారాయణ పేట జిల్లాలో 2, వికారాబాద్ జిల్లాలో 1, మహబూబాబాద్ జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 1, జగిత్యాల జిల్లాలో 2, సంగారెడ్డి జిల్లాలో 1, కామారెడ్డి జిల్లాలో 1 మండలాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. 

 

జిల్లా

రెవెన్యూ డివిజన్

కొత్తగా ఏర్పాటు చేసిన మండలం

1

నిజామాబాద్‌

ఆర్మూర్ రెవిన్యూ డివిజన్

ఆలూర్, డొంకేశ్వర్ మండలాలు

2

నిజామాబాద్

బోధన్ రెవిన్యూ డివిజన్

సాలూర మండలం

3

నారాయణ పేట

నారాయణ పేట రెవిన్యూ డివిజన్

గుండుమల్, కొత్తపల్లె మండలాలు

4

వికారాబాద్

తాండూర్ రెవిన్యూ డివిజన్

దుడ్యాల్ మండలం

5

మహబూబ్ నగర్

మహబూబ్ నగర్ రెవిన్యూ డివిజన్

కౌకుంట్ల మండలం

6

మహబూబాబాద్

మహబూబాబాద్ రెవిన్యూ డివిజన్

సీరోల్ మండలం

7

నల్లగొండ

నల్లగొండ రెవిన్యూ డివిజన్

గట్టుప్పల్  మండలం

8

సంగారెడ్డి

నారాయణ్ ఖేడ్ రెవిన్యూ డివిజన్

నిజాంపేట్‌ మండలం

9

కామారెడ్డి

బాన్సువాడ రెవిన్యూ డివిజన్

డోంగ్లీ మండలం

10

జగిత్యాల

జగిత్యాల రెవిన్యూ డివిజన్

ఎండపల్లి మండలం

11

జగిత్యాల

కోరుట్ల డివిజన్

భీమారం మండలం