కలిసి పోరాడుదాం రండి: కేసీఆర్‌

ఓ వైపు తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పాగా వేసేందుకు చురుకుగా పావులు కడుపుతుంటే మరోవైపు సిఎం కేసీఆర్‌ సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలలో మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుండటం విశేషం. 

శుక్రవారం ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవింద్‌  కేజ్రీవాల్‌, మమతా బెనర్జీలతో విపక్ష నేతలు శరత్ పవార్, అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్ తదితరులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈ సమావేశాలలో కేంద్రప్రభుత్వం నియంతృత్వ ధోరణులు, బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలను వేధించడం, కూలద్రోసే ప్రయత్నాలు చేస్తుండటం వంటి పలు అంశాలపై పార్లమెంటులో టిఆర్ఎస్‌ ఎంపీలతో కలిసి పోరాడేందుకు ముందుకురావాలని సిఎం కేసీఆర్‌ వారిని కోరారు. ఆ పార్టీల అధినేతలు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. 

ఈరోజు ప్రగతి భవన్‌లో టిఆర్ఎస్‌ ఎంపీలతో సిఎం కేసీఆర్‌ సమావేశమయ్యి పార్లమెంటు సమావేశాలలో ఏవిదంగా వ్యవహరించాలో వారికి దిశానిర్దేశం చేయనున్నారు.