
నేడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి. ఈ సందర్భంగా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో 30 అడుగుల ఎత్తుతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరిస్తారు.
ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయనకు వీడ్కోలు పలుకుతారు. గన్నవరం చేరుకొన్నాక అక్కడి నుంచి హెలికాప్టర్‌లో భీమవరం సమీపంలోని పెద అమిరం చేరుకొంటారు. విగ్రహావిష్కరణ తరువాత సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సిఎం జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొంటారు. అల్లూరి సీతారామరాజు వంశీకులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. వారితో ప్రధాని నరేంద్రమోడీ కొంతసేపు మాట్లాడుతారు. అక్కడ సభ ముగిసిన తరువాత ప్రధాని నరేంద్రమోడీ మళ్ళీ గన్నవరం నుంచి ఢిల్లీ తిరుగు ప్రయాణం అవుతారు.