నేడు ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం.. హాజరుకానున్న కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఉజ్జల్ భూయాన్ నేడు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. విశేషమేమిటంటే, గత ఆరేడు నెలలుగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌పై కత్తులు దూస్తూ రాజ్‌భవన్‌లో అడుగుపెట్టని సిఎం కేసీఆర్‌, ఇవాళ్ళ ఆమె ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 

ఈ సందర్భంగా హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు రాజ్‌భవన్‌ పరిసర ప్రాంతాలలో ఇవాళ్ళ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కనుక వాహనదారులు వేరే మార్గాలలో తమ గమ్యస్థానాలు చేరుకోవలసి ఉంటుంది.