
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధ్యాయుల ఈరోజు ఉపాధ్యాయుల పరస్పర బదిలీలపై అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తక్షణం ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 2,558 మంది ఉపాధ్యాయులు, భోదనేతర సిబ్బంది తమ సొంత జిల్లాలకు బదిలీ పొందగలుగుతారు.
ఇటీవల కొత్త జిల్లాలు, జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగులను సర్దుబాటు చేసినప్పుడు చాలా మందికి వేరే జిల్లాలకు బదిలీ అయ్యారు. దాంతో వారు పరస్పర బదిలీలకు అనుమతించాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. కనుక వారి అభ్యర్ధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పరస్పర బదిలీలకు అనుమతించాలని నిర్ణయించింది. త్వరలోనే ఈ ప్రక్రియ మొదలవుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.