అగ్నిపథ్‌ తరువాత ఏ ఉద్యోగాలు చేయాలి? కేటీఆర్‌

అగ్నిపథ్‌ పధకంలో భాగంగా నాలుగేళ్ళు రక్షణ దళాలలో పనిచేసిన తరువాత ఇంటికి పంపించేస్తారు. అప్పుడు వారు ఏ ఉద్యోగాలు చేయాలని తెలంగాణ ఐటి, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. అగ్నిపథ్‌ను వ్యతిరేకించేవారు ప్రధాని నరేంద్రమోడీని అర్ధం చేసుకోలేకపోతున్నారని వాదిస్తున్న కొందరు కేంద్రమంత్రులు, అగ్నిపథ్‌ ఉద్యోగం ఊడిన తరువాత సెక్యూరిటీ గార్డులుగా, డ్రైవర్లు, ఎలక్ట్రీషియస్స్, మంగలి, చాకలి పనులు చేసుకోవచ్చునని చెప్పడం చాలా దారుణమని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. దేశంలో నిరుద్యోగ యువత పట్ల ఈవిదంగా చులకనగా మాట్లాడుతూ తిరిగి వారు ప్రధాని నరేంద్రమోడీని అర్ధం చేసుకోలేకపోతున్నారని విమర్శించడం సిగ్గు చేటు అని మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు.