మహీంద్రా గ్రూప్ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్ర అగ్నిపథ్‌కు మద్దతు తెలిపారు. “అగ్నిపథ్‌పై చెలరేగుతున్న హింస చాలా విచారకారం. కేంద్రప్రభుత్వం గత ఏడాది ఈ అగ్నిపథ్ ప్రతిపాదన గురించి చెప్పినప్పుడు, మళ్ళీ ఇప్పుడు కూడా మద్దతు ఇస్తున్నాను. ఆ శిక్షణతో యువతకు మంచి క్రమశిక్షణ, అగ్నివీరులుగా మంచి నైపుణ్యం పొందుతారు కనుక నాలుగేళ్ళ తరువాత వారు బయటకు వచ్చినప్పుడు వారికి భారీగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పాను. అగ్నివీరులుగా శిక్షణ పూర్తిచేసుకొని వచ్చినవారికి మా మహీంద్రా గ్రూపులో ఉద్యోగాలు కల్పించేందుకు సిద్దంగా ఉంది,” అని ట్వీట్ చేశారు.
అగ్నిపథ్‌ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. అగ్నిపథ్ పధకాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని కోరుతూ ప్రియాంకా వాద్రా తదితర కాంగ్రెస్ నేతలు నిన్న ఢిల్లీలో ధర్నా చేశారు. అగ్నిపథ్ ఉపసంహరించుకొనేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో సహా దేశవ్యాప్తంగా బిజెపియేతర పార్టీలు అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తున్నాయి.