
అగ్నిపథ్ నియామక విదానంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఈ విషయంలో తగ్గేదేలేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది.
భారత్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ బంశీ పొన్నప్ప నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “సోమవారం అగ్నిపథ్ నియామకాలకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయబోతున్నామని చెప్పారు. మొత్తం 40,000 మందిని రిక్రూతే చేసుకోబోతున్నాము. దీని కోసం దేశవ్యాప్తంగా 83 రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహించబోతున్నాము. మొదటి బ్యాచ్లో 25,000 మందికి డిసెంబర్ మొదటి రెండు వారాలలో శిక్షణ ప్రారంభిస్తాము. రెండో బ్యాచ్ అభ్యర్ధులకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శిక్షణ ప్రారంభిస్తాము,” అని చెప్పారు.
భారత్ వాయుసేన ఎయిర్ మార్షల్ ఎస్ కె ఝా మీడియాతో మాట్లాడుతూ, “ఈనెల 24వ తేదీ నుంచి అభ్యర్ధుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రాంభిస్తాము. మొదటి బ్యాచ్ రిక్రూట్మెంట్ కోసం జూలై 24 నుంచి ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తాము. వాటిలో ఉత్తీర్ణులైన అభ్యర్ధులకు ఈ ఏడాది డిసెంబర్ 30వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభిస్తాము,” అని చెప్పారు.
భారత్ నౌకాదళం వైసీపి అడ్మిరల్ (పర్సనల్) దినేష్ త్రిపాఠి మీడియాతో మాట్లాడుతూ, “ఈ నెల 20వ తేదీన విడుదల కాబోతోంది. 25న అగ్నిపథ్ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ జారీ చేస్తాము. అగ్నివీరులుగా ఎంపికైన యువతీయువకులకు ఈ ఏడాది నవంబర్ 21 నుంచి ఒడిశాలోని ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ ప్రారంభిస్తాము,” అని చెప్పారు.