నేను కాంగ్రెస్‌లో చేరుతున్నా: టిఆర్ఎస్‌ కార్పొరేటర్

ఆర్ఎస్‌ పార్టీకి ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి షాక్ ఇవ్వబోతున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఈరోజు ఆమె ప్రకటించారు. 

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఈరోజు ఉదయం విజయా రెడ్డి నివాసానికి వెళ్ళి ఆమెతో మాట్లాడారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, “మా నాన్నగారు (పి.జనార్ధన్ రెడ్డి) కాంగ్రెస్ పార్టీలో చిరకాలం పనిచేశారు.  కనుక మా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో మంచి అనుబందం ఉంది. కొన్ని కారణాల వలన నేను టిఆర్ఎస్‌ పార్టీలో  చేరినప్పటికీ ఆ పార్టీలో నాయకుల తీరుతో చాలా ఇబ్బందిగా ఉంటోంది. పీజేఆర్ కుమార్తెగా కాంగ్రెస్‌ భావజాలం కలిగిన నేను టిఆర్ఎస్‌ పార్టీలో ఇమడలేకపోతున్నాను. కనుక త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకొన్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్‌ ఉంది. టిఆర్ఎస్‌కు కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమని నేను భావిస్తున్నాను,” అని చెప్పారు.