
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం ఉదయం ఆందోళనకారులు విధ్వంసం సృష్టించడంతో రైల్వే పోలీసులు కాల్పులు జరపగా వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం డబీర్ పేటకు చెందిన దామెర రాకేష్ (22) అనే యువకుడు మృతి చెందగా మరో 12 మంది యువకులు గాయపడ్డారు.
ఈ ఘటనపై సిఎం కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసుల కాల్పులలో చనిపోయిన రాకేష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షల పరిహారం, అతని కుటుంబంలో అర్హులైనవారికి ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇస్తామని ప్రకటిచారు.
సిఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలకు తెలంగాణ బిడ్డ బలవడం చాలా బాధ కలిగించింది. రాకేష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకొంటుంది. తెలంగాణ బిడ్డలను ప్రభుత్వం కాపాడుకొంటుంది,” అని అన్నారు.
సికింద్రాబాద్ స్టేషన్లో నిన్న పోలీసుల కాల్పులలో గాయపడినవారి వివరాలు:
నాగేందర్ బాబు (21) ఖమ్మం జిల్లాలో లక్ష్మీపురం, దండు మహేష్ (20) వికారాబాద్ జిల్లాలో బొంరెడ్డి పల్లి, లక్కం వినయ్ (20) మహబూబ్‌నగర్ జిల్లాలో మధ్యవంచ గ్రామం, జగన్నాథ్ (20) కర్నూలు జిల్లాలో మంత్రాలయం.
లాఠీ ఛార్జీలో గాయపడినవారి వివరాలు:
జి.పరశురామ్ (22), పి.మోహన్ (20) నిజాంసాగర్, కామారెడ్డి, కె.రమేష్ (20) చింతకుంట, కరీంనగర్, భారత్ కుమార్ (21) ముథోల్, నిర్మల్ జిల్లా, ఏ.శ్రీకాంత్ (20) పాలకొండ, మహబూబ్‌నగర్, ఈ.విద్యాసాగర్ (20) ఆసిఫాబాద్ జిల్లా, ఏ.కుమార్ (21) వరంగల్ జిల్లా, ఎస్.లక్ష్మణ్ రెడ్డి (20) మిర్యాలగూడ.