7.jpg)
జూన్ 2వ తేదీన బిజెపి అధ్వర్యంలో నాగోల్ బండ్లగూడలో ‘అమరుల యాదిలో’ అనే కార్యక్రమంలో బిజెపికి చెందిన రాణి రుద్రమ్మ, దరువు ఎల్లన్నలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కించపరుస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలను ఎద్దేవా చేస్తూ చిన్న వ్యంగ్య నాటిక ప్రదర్శించారు. ముఖ్యమంత్రి పట్ల అవమానకరంగా ప్రవర్తించినందుకు హయాత్ నగర్ పోలీసులు రాణి రుద్రమ్మ, దరువు ఎల్లన్న, జిట్టా బాలకృష్ణా రెడ్డిలను అరెస్ట్ చేశారు. బండి సంజయ్‌కి సెక్షన్ 41 (ఏ) కింద నోటీసులు పంపించారు. ఈ కేసులో బాలకృష్ణా రెడ్డి బెయిల్ తీసుకొని విడుదలయ్యారు.
బండి సంజయ్‌తో సహా రాష్ట్ర బిజెపి నేతలు నిత్యం సిఎం కేసీఆర్, ఆయన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని బహిరంగంగానే విమర్శిస్తుంటారు. గత ఏడాది ఇంటర్ విద్యార్దుల ఆత్మహత్యలకు మంత్రి కేటీఆరే బాధ్యుడని బండి సంజయ్ తీవ్ర ఆరోపణ చేయగా వెంటనే స్పందించిన కేటీఆర్, “మీ ఆరోపణను నిరూపించాలి లేదా బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేకుంటే పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు.” కానీ బండి సంజయ్ ఆయన హెచ్చరికను ఏమాత్రం పట్టించుకోలేదు పైగా ఇంకా ఘాటుగా విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
బండి సంజయ్ వెనుక ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాతో సహా యావత్ కేంద్రప్రభుత్వం ఉన్నప్పుడు హయాత్ నగర్ పోలీసులు మాత్రం ఏం చేయగలరు? బహుశః అందుకే నోటీసులతో సరిపెట్టినట్లున్నారు.