రాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ జారీ

రాష్ట్రపతి ఎన్నికలకి కేంద్ర ఎన్నికల కమీషన్‌కు కొద్దిసేపటి క్రితం షెడ్యూల్ ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమీషనర్‌ రాజీవ్ కుమార్‌ ఎన్నికల షెడ్యూల్ జారీ చేశారు. రాష్ట్రపతి ఎన్నికతో పాటు ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. జూలై 24వ తేదీతో ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం ముగుస్తుంది. కనుక ఆ లోపుగా రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్ధులు పోటీ పడినట్లయితే ఎన్నికలు అవసరమవుతాయి. అప్పుడు జూలై 18న పోలింగ్ నిర్వహించి, జూలై 21 ఫలితాలు ప్రకటిస్తారు. ఒకవేళ ఒక్కరే నామినేషన్ వేసినట్లయితే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.    

నోటిఫికేషన్‌ జారీ: జూన్‌ 15

నామినేషన్ల దాఖలుకి చివరి తేదీ: జూన్‌ 29. 

నామినేషన్ల పరిశీలన: జూన్‌ 30. 

నామినేషన్ల ఉపసంహరణ: జూలై 2.

పోలింగ్: జూలై 18 (ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నట్లయితే)

ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన: జూలై 21.