సమైక్య రాష్ట్రంలోనే చంద్రబాబుకి కేసీఆర్‌ ఎసరు: బిజెపి

సుమారు 21 ఏళ్ళ క్రితం జరిగిన ఓ పెద్ద రహస్యాన్ని మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత ఏ. చంద్రశేఖర్ ఈరోజు బయటపెట్టారు. అదీ… ఆటంబాంబులాంటి భయానక రహస్యం. నేడు నాగోలులోని జెకన్వెషన్‌లో బిజెపి అధ్వర్యంలో అమరవీరులయాదిలో ఉద్యమ ఆకాంక్ష సభ జరిగింది. ఆ సభలో చంద్రశేఖర్ ప్రసంగిస్తూ, “2001లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్‌ ఆయన ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు నాతో సహా మొత్తం 60 మంది ఎమ్మెల్యేలను కూడగట్టారు. అయితే చివరిగా చంద్రబాబు నాయుడుకు అత్యంత ఆప్తుడైన జ్యోతుల నెహ్రూని కూడా కలుపుకుపోయే ప్రయత్నంలో తన ప్లాన్ అంతా ఆయనకు కూడా వివరించారు. ఆయన వెంటనే చంద్రబాబుకి ఈవిషయం చేరవేశారు. దాంతో చంద్రబాబు అప్రమత్తమై తగిన చర్యలు తీసుకొని ఎమ్మెల్యేలు చేజారిపోకుండా అడ్డుకొని తన ప్రభుత్వాన్ని కాపాడుకొన్నారు. కేసీఆర్‌కు ఆనాటి నుంచే ముఖ్యమంత్రి అయిపోవాలనే పదవీ కాంక్ష ఉందని మీకు తెలియడానికే ఇప్పుడు ఈ రహస్యం బయటపెడుతున్నాను,” అని ఏ చంద్రశేఖర్ చెప్పారు.  


వీడియో ఈనాడు సౌజన్యంతో...