తెలంగాణలో రేపు 32 జ్యుడీషియల్ జిల్లాలు ప్రారంభోత్సవం

తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో 10 జిల్లాలను పునర్విభజన చేసి హైదరాబాద్‌ కాకుండా 32 జిల్లాలను ఏర్పాటు చేసినందున, న్యాయపరమైన సౌలభ్యం కొరకు 32 జ్యూడీషియల్ జిల్లాలుగా వాటిని గుర్తించవలసి ఉంది. దీని కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ గురువారం హైదరాబాద్‌ రాబోతున్నారు. 

గురువారం సాయంత్రం 5 గంటలకు తెలంగాణ హైకోర్టు ఆవరణలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, తెలంగాణ సిఎం కేసీఆర్‌, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, హైకోర్టు, 32 జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సమక్షంలో 32 జ్యూడీషియల్ జిల్లాలను జస్టిస్ ఎన్‌వి రమణ ప్రారంభించనున్నారు. 

ఈ కార్యక్రమం కోసం హైకోర్టు వేసవి సెలవులను కుదించి నేటి నుంచి అందరూ విధులకు హాజరుకావాలని జస్టిస్ ఎన్‌వి రమణ ఉత్తర్వులు జారీ చేశారు.